పొలాలు ఎండుతుంటే.. మా ఎమ్మెల్యే అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది : రైతులు

-

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని సోమరపుకుంట తండాలో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటువంటి సమయంలో తమకు అండగా నిలిచి సాగుకు నీళ్లు ఇప్పించాల్సిన తమ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నదాతలు వాపోయారు.

 

కనీసం నువ్వైనా కరుణించు అంటూ వరుణదేవున్ని రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగుకోసం నీరిస్తలేరని, ఓవైపు మా పొలాలు ఎండిపోతుంటే మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాత్రం అమెరికాలో ఎంజాయ్ చేస్తుందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. పంట సాగుకు పెట్టుబడి రూ. 5 లక్షలు పెట్టినా.. అవి కూడా వచ్చేలా లేవని.. వచ్చే నెలలో తన బిడ్డ పెళ్లి ఉందని, ఎలా చేయాలంటూ ఓ రైతు వాపోయింది. మరో వైపు ‘నేను, నా పిల్లలు, భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని’ మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఆకేరు వాగులోకి నీళ్లు వదలక పొతే తమ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.

https://twitter.com/TeluguScribe/status/1899360071609360584

Read more RELATED
Recommended to you

Latest news