కేసీఆర్ దొంగ దీక్షలు చేశారు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దొంగ దీక్షలు చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసారు. పెండింగ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు పై చర్చించారు. RRR కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్, యాదగిరిగుట్ట ఆలయం, భువనగిరి కోట, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్, మంథనిలోని రామగిరి కోటకు రోప్ వే వేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే-65 లేన్లుగా విస్తరించే డీపీఆర్ తయారీని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనే ప్రచారం వాస్తవం కాదని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news