అంబర్ పేట లో దారుణం..భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

-

అంబర్ పేట లో దారుణం జరిగింది. భార్య రేఖ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త నవీన్. ఆ తర్వాత ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు భర్త. భార్య వాంగ్మూలం తో అసలు విషయం వెలుగులోకి.. వచ్చింది. మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు నవీన్. భార్యను చంపుతానని పలుమార్లు హెచ్చరించిన నవీన్.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకున్నాడు. మరోమారు భార్య తో గొడవ పెట్టుకున్నాడు నవీన్.

ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు నవీన్.. తనతో గొడవ పడి ఆత్మహత్యా యత్నం చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు నవీన్. నిజామాబాద్ లో ఉండే అత్త, మామలకు ఫోన్ చేసి.. మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు నవీన్. అయితే.. నవీన్‌ పైన ఉన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు నిజామాబాద్ లో ఉండే అత్త, మామలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. అటు చికిత్స పొందుతూ మృతి చెందింది రేఖ. దీంతో నవీన్ పై కేసు నమోదు చేసి…దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news