‘వరల్డ్ ఫేమస్ లవర్’ : ‘బొగ్గు గనిలో’ సాంగ్ : ఇన్స్టంట్ చార్ట్ బస్టర్….!!

-

యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన క్యాథరీన్, ఇజా బెల్లె, ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతున్న ఈ సినిమా టీజర్ మరియు మై లవ్ అనే పల్లవితో సాగె సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదిచాయి. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి యువ సింగర్ నిరన్జ్ సురేష్ ఆలపించిన బొగ్గుగనిలో అనే లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. వినగానే ఎంతో ఆకట్టుకునేలా సాగిన ఈ సాంగ్ కి గోపి సుందర్ అందించిన ట్యూన్ తో పాటు సింగర్ సురేష్ వాయిస్, అలానే రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింతగా ఆకట్టుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక దీనితో సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మరింతగా అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అందులోను గత కొద్దిరోజులుగా విజయ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయనకు ఈ సినిమా విజయం తప్పనిసరి అయింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం రోజైన ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news