రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పీక్ అవర్స్ లో రివర్స్ పంపింగ్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. 2020-21లో 13,600 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. ఇప్పుడు 17వేల మెగావాట్ల పీక్ డిమాండ్ పెరిగింది. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. మేము అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని 250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ కోసం టెండర్లను పిలిచినట్టు తెలిపారు. 22లో విద్యుత్ డిమాండ్ 14 వేలకు, 23లో 15వేలకు పైగా 24లో 16వేలకు పైగా.. ప్రస్తుతం 17వేల మె.వా. పీక్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఇంత డిమాండ్ పెరిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ అంబులెన్స్ ను తీసుకొస్తున్నామని తెలిపారు.