రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఎసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లిం సోదరులతో కలిసి జగన్ విందు చేశారు. ముస్లిం మత పెద్దలతో పాటు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్తార్ విందుకు హాజరయ్యారు. పలువురు జగన్ కి పండ్లు తినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్తార్ విందులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ఇప్తార్ వేడుకను నిర్వహించనుంది.