బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఓ బస్సు వెనుక నుంచి వచ్చి ఐశ్వర్య కారును ఢీకొట్టినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారడంతో ఐశ్వర్య ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటికి ఏమైందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, కారుకు ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యా రాయ్ అందులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటు చేసుకోలేదని ఐశ్వర్యా రాయ్ టీమ్ స్థానిక మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. ఐశ్వర్య సురక్షితంగా ఉన్నారని తెలిపినట్లు తెలిసింది. ఇక ఐశ్వర్యా రాయ్ గత కొంతకాలంగా సినిమాలేం చేయడం లేదు. అయితే మెట్ గాలా, లోరియల్ ఫ్యాషన్ వీక్ వంటి పలు ఫ్యాషన్ షోలకు మాత్రం అటెండ్ అవుతోంది. ఇక ఇటీవల ఐశ్వర్యా రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.