రోడ్డుకి స్థలం ఇవ్వనందుకు, టీచర్ ని రోడ్డు మీద ఈడ్చారు…!

-

పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. ఒక టీచర్ ని రోడ్డు మీద ఈడ్చారు అధికార పార్టీ నేతలు. పశ్చిమ బెంగాల్ యొక్క దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రహదారి నిర్మాణం కోసం బలవంతంగా తన భూమిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేయగా అడ్డుకున్న ప్రాథమిక పాఠశాల టీచర్ పై అమానుషంగా దాడి చేసారు కొందరు వ్యక్తులు. ఆమెను దారుణంగా హింసించారు.

దక్షిణ దినజ్ పూర్ జిల్లాలోని గంగ్రాంపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడిని స్థలం రోడ్డు విస్తరణకు అవసరమైంది. అయితే ఆ స్థలం తాను ఇవ్వాలి అంటే పరిహారం ఇవ్వాలని, ఆ స్థలం తన కష్టార్జితం అని తనకు ఉన్న ఆస్తి అది ఒకటే అని ఆ టీచర్ వాదించారు. దీనితో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమల్ సర్కార్‌తో సహా ఒక బృందంతో ఆ గ్రామానికి చేరుకున్నారు.

ఆమెను ముందు బ్రతిమిలాడగా ఆమె అందుకు అంగీకరించలేదు. తర్వాత ఆమెపై బెదిరింపులకు దిగారు. అయినా సరే ఆమె స్తాలన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. దీనితో తాడుతో కట్టి లాగి, ఆమెను దారుణంగా కొట్టారు. దీనిపై బాధిత టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడిపై దాడి చేసిన అమల సర్కార్ ని పార్టీ నుంచి బహిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news