బియ్యం కడిగిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

-

రోజులో ఎన్నో సమస్యలు అందులో ఆనారోగ్యం కూడా ఒకటి వచ్చి చేరుతుంది. పనిలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు కానీ ఆరోగ్యంలో సమస్యలుంటే మాత్రం కొంచెం కష్టభరితమే. జ్వరం, డీహైడ్రేషన్‌, జీర్ణసమస్యలు, పైత్యం, వాంతులు లాంటి ఎలాంటి సమస్యలకైనా వంటింట్లో పదార్థాలతోనే అరకట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఏ జబ్బుకి ఎలాంటి పరిష్కారమో చూద్దాం.

మనలోనే చాలామంది చిన్న జలుబు, దగ్గు వచ్చిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి డబ్బులు ఖర్చుచేసుకుంటూ ఉంటారు. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మంచిదే. కానీ ప్రతి చిన్న విషయానికి వైద్యుడుని కలిసి డబ్బు, సమయం ఖర్చు చేసుకునేకంటే మొదటి చికిత్సగా ఇంట్లోనే చేసుకునేలా తయారవ్వాలి. అలా చేసుకోవాలంటే ముందుగా పరిష్కార మార్గాలు కనుక్కోవాలి.

– మొదటి రెండు రోజులు జ్వరం సాధారణంగా గానే ఉంటుంది. తగ్గకుంటే మూడోరోజుకి విపరీతం గా ఉంటుంది. జ్వరం ఉన్నవారికి డీహైడ్రేషన్‌ కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మెంతికూర, తులసి రసాలకు తేనె జోడించి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని సేవిస్తే తీవ్రమైన జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
– నాన్‌వెజ్‌ అంటే ఇష్డపడని వారుండరు. ఇంట్లో చేసుకొని తినేకంటే బయట తినడానికి ఎక్కువ ఇష్టపడుతారు. వారికి తిన్నది సరిగా అరగదు. అలాంటి వారు నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగిత మంచిది.

– గర్భిణీ స్త్రీలు మరికొంతమందికి పైత్యం, వికారం వల్ల వాంతులు, దురద, కాలేయ సమస్యలు తగ్గాలంటే.. స్పూన్‌ అల్లం రసంలో పావుచెంచా జీలకర్ర, తేనె వేసి తీసుకున్నట్లయితే సమస్యలన్నీ మాయమవుతాయి.
– మహిళలు పీరియడ్స్‌ విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. వారిని బాధ నుంచి బయటపడేయడానికి ఒక మంచి చిట్కా ఉంది. వీరు పదిరోజుల ముందు నుంచి వేడినీళ్లలో అల్లం రసం వేసి తీసుకున్నట్లయితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
– కొంతమందికి మూత్రవిసర్జణ సరిగా చేయరు. వస్తున్నా కడుపు ఉబ్బపెట్టుకొని గంటల వ్యవధి తర్వాత విసర్జన చేస్తారు. దానికి కారణం వారికి రాకపోవడమే. అలా జరగకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లలో అల్లం రసం కలిపి తీసుకున్నట్లయితే మూత్రవిసర్జన సమయానికి రావడంతోపాటు, మంట సమస్య తగ్గుతుంది.
– ఏ కాలంలో అయినా గొంతు ఇన్‌ఫెక్షన్‌, నోటిపూత సమస్య ఉంటుంది. వారు బియ్యం కడిగిన నీటిలో అల్లం రసం, తేనె కలిపి తాగితే సమస్య గట్టెక్కుతుంది.

– భోజనం తిన్నాక నీరు అధికంగా తాగకూడదు. భోజనం చేసిన తర్వాత చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగకుండా ఉంటుంది. అలాగే కడుపునిండా తిన్న ఆరోగ్యం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
– కడపుతో మంట, నొప్పి వస్తున్నప్పుడు టాబ్లెట్లు వేసుకోకూడదు. శస్త్రచికిత్సగా అరగ్లాసు పాలల్లో అల్లం, పుదీనారసం సమపాళ్లలో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news