గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధర.. వెండి కూడా..

-

నిన్న భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర ఈ రోజు త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 90 రూపాయలు తగ్గింది. దీంతో 42,760 నుంచి 42,670 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. 120 రూపాయలు తగ్గడంతో 39,230 నుంచి 39,110 రూపాయల వద్దకు చేరుకుంది. ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కేజీకి 990 రూపాయలు దిగొచ్చాయి. దీంతో వెండి ధరలు కేజీకి 49,000 రూపాయల వద్దనిలిచాయి.

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 60 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,150 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,950 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 49,000 రూపాయలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news