జగన్ కి షాక్, ఏపీని మర్చిపోయిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రం నుంచి వరుస షాకులు తగులుతున్నాయని… మరి ఆయన తీసుకునే నిర్ణయాలో లేక ఆంధ్రప్రదేశ్ లో తాము బలపడే అవకాశం లేదని ఢిల్లీ పెద్దలు భావించారో గాని ఆంధ్రప్రదేశ్ గురించి బడ్జెట్ లో అసలు ప్రస్తావించే సాహసం ఎంత మాత్రం చేయలేదు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చినవి ఏమీ లేవు అనే సంగతి అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంట్ అంశంగా మారిన ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం మాట కూడా మాట్లాడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావన అనేది కేంద్రం ఇప్పటి వరకు తీసుకురావడం లేదు. రాష్ట్రం వద్ద నిధులు లేవు… ఆ విషయం కేంద్ర పెద్దలకు తెలుసు. అయినా సరే ఆదుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకి వెళ్ళడం లేదు.

ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో దీనికి సంబంధించిన చర్చ కూడా లేదు. వెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లు విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు రూ.23వేల కోట్లు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు చెప్పారు కూడా. పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్ర రీయింబర్స్‌మెంట్ చేయాలని పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేసారు.

అయినా సరే కేంద్రం నుంచి స్పష్టత రావడం లేదు. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి ఏ ఒక్కటి కూడా ముందుకి వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. అలాగే విభజన హామీల పరిష్కారం విషయంలో కూడా కేంద్రం చొరవ చూపించే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదనే అంటున్నారు. ప్రత్యేక హోదా కేంద్రం తలుచుకుంటే ఇవ్వొచ్చని 15వ ఆర్ధిక సంఘం కూడా చెప్పినా సరే కేంద్రం మాత్రం ఆ మాట మాట్లాడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news