నందమూరి ఫ్యాన్స్ స్పెషల్ ట్రీట్.. అరవింద సమేత మేకింగ్ వీడియో..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక సినిమాపై మరింత అంచనాలు పెరిగేలా అరవింద సమేత మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. త్రివిక్రం యాక్షన్ చెప్పడమే ఆలస్యం ఎన్.టి.ఆర్ సీన్ కు రెడీ అవుతున్నాడు. ఇక పూజాతో సరదా సంభాషణలు.. ఎన్.టి.ఆర్, త్రివిక్రం డిస్కషన్స్ ఇలా మేకింగ్ వీడియో అంతా కన్నుల పండుగగా ఉంది.

దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద సమేత సినిమా కచ్చితంగా మరోసారి ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ అయ్యేలా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news