టిడిపిని ఫినిష్ చేయాల‌నే ముందస్తు : చంద్ర‌బాబు

-

  • ఇద్ద‌రం ఒక‌టిగా పనిచేద్దామంటే కేసీఆర్ మోదీ మాయ‌లో ప‌డ్డారు
  •  అలిపిరిలో నాపై దాడి చేసిన‌వారే అర‌కులోనూ చంపారు
  •  పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో చంద్ర‌బాబు

Chandrababu naidu Fire On KCR

అమరావతి: తెలంగాణ‌లో తెలుగుదేశం ఇప్ప‌టికే బ‌లంగా ఉంది..షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగేలోగా మ‌రింత పుంజుకుంటుంద‌నుకున్నాం. కానీ తెలుగుదేశాన్ని పూర్తిగా ఫినిష్ చేయాల‌న్నా ల‌క్ష్యంతో అక్క‌డ ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు అని ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనే సంకేతాలను గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినా.. ప్రధాని మోదీ మాయలో పడిన కేసీఆర్ అందుకు అంగీకరించలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. తెలుగుదేశం నేతలతో తాజా రాజకీయ పరిణామాలు, మావోయిస్టుల కదలికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. బిజేపీ, వైసీపీ, జనసేన కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాయని చంద్ర‌బాబు ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలిపిరిలో తనపై దాడికి పాల్పడిన వారే కుట్రపూరితంగా అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని అన్నారు.

న‌న్ను ప్ర‌ధానిని చేయొద్దండి

అడుగడుగునా రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీఎం విమర్శించారు. రేవెంత్ రెడ్డిపై ఐటి దాడులు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచార‌ణ‌ల నేప‌థ్యంలో …తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే, అధికారంలోకి వచ్చి ఏపీలో తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని బిజేపీ కేసీఆర్‌తో ఆడిస్తున్న నాటకంగా ఈ సమావేశంలో నేతలంతా అభిప్రాయపడినట్టు సమాచారం. ద‌యచేసి మీరంతా న‌న్ను కాబోయే ప్ర‌ధాని అని మాత్రం అన‌కండి. అలాంటి కామెంట్లు చేస్తే అన‌వ‌స‌రంగా ఇబ్బందులు వ‌స్తాయి. చంద్రబాబు ప్రధాని అవుతారన్న కామెంట్లను ఎవరూ చేయొద్దని చంద్ర‌బాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news