నట రత్న నందమూరి బాలకృష్ణ సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందా…? అంటే అవుననే అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇదే సమయంలో కొన్ని రూమర్లు కూడా వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తారని… ఈ సినిమా జూన్ నుంచి మొదలయ్యే అవకాశం ఉందని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా ఎంత వరకు నిజమో తెలియదు గాని టాలివుడ్ నిజమే అంటుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు చేసే అవకాశం లేదని, ఆ తర్వాత నిర్మాతగా మారే సూచనలు ఉన్నాయని అంటున్నారు. చిన్న హీరోలతో ఆయన సినిమాలు చేసే అవకాశం ఉందనే టాక్ వినపడుతుంది. ఇక తన కొడుకు భవిష్యత్తు మీద బాలకృష్ణ దృష్టి పెట్టారని టాక్ వినపడుతుంది. తాను నిర్మాతగా కొడుకుతో సినిమాలు చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. తన చివరి సినిమాను మల్టీ స్టారర్ గా బాలకృష్ణ చేస్తారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.