ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ని మరియు కేటీఆర్ ని విమర్శించడంలో ఎప్పుడు ముందుంటాడు. వీరందరూ కలిసి ఒకే చోట ఉండటంతో జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో ఓపెన్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో హైలైట్ అయ్యింది. తనపై ఎన్ని విమర్శలు చేసినా, కెసిఆర్ ఎంపీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానం పంపారట. దీంతో కేసీఆర్ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ విషయం తెలంగాణ రాజకీయాలతో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా హైలైట్ అయిందట.
దీంతో ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేసీఆర్ను మెచ్చుకున్నట్లు జాతీయస్థాయిలో టాక్. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో పాటు దేశ స్థాయిలో మరో కూటమి ఏర్పాటు చేసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కలుపుకునే స్థితికి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా కేసీఆర్ వ్యవహరించడంతో ఆయన పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది రోజురోజుకి.