కరోనా వైరస్‌కు కొత్త పేరు.. covid-2019 ఎందుకో తెలుసా..?

-

కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ సంగతి తెల్సిందే. ఈ వైరస్ ధాటికి దాదాపు 900 మంది మరణించగా వేలాదిమంది ఇంకా బాధించబడుతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావనంలా వ్యాపించాయి. కరోనావైరస్‌ లాటిన్‌ పదం కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. అయితే తాజాగా ప్రపంచాన్ని భ‌య‌ప‌డుతున్న‌ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది.

 

ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అదానోమ్ తెలిపారు. కోవిడ్-19 (covid-2019) అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని పేర్కొన్నారు. కొన్ని వైరస్‌ల సమూహానికి కరోనా అని పేరు ఉందని, దాంతో ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు తెలిపారు. ఈ పేరు స్వతంత్రంగా ఏ ఒక్కదానినీ సూచించదని పేర్కొన్న టెడ్రస్.. ఈ కొత్త పేరు ఆ వ్యాధిని గురించి మాత్రమే తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news