గుడ్ న్యూస్‌: భారీగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న స్వ‌ల్పంగా దిగొచ్చిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా ప‌త‌న‌మైంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.290 క్షీణించింది. దీంతో ధర రూ.38,980 నుంచి రూ.38,690కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే దిగొచ్చింది. రూ.290కు పడిపోయింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 నుంచి రూ.42,240కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో ధర రూ.49,300 నుంచి రూ.49,000కు పడిపోయింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.300 క్షీణించింది. దీంతో ధర రూ.40,700కు దిగొచ్చింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణతతో రూ.39,500కు తగ్గింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గుదలతో రూ.49,000కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news