ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చ్ 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సర్పంచ్ స్థానికంగా ఉండే విధంగా నిబంధనలు పెట్టనున్నారు. అదే విధంగా నగదు మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
నగదు మద్యం దొరికితే మాత్రం అభ్యర్ధిపై అనర్హత వేటు వేయనున్నారు. అదే విధంగా ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు బిల్లుకి ఆమోదం తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఇక ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే వెంటనే అనర్హత వేయనున్నారు. పంచాయితీ రాజ్ చట్టంలో కీలక సవరణలు చేసింది రాష్ట్ర కేబినేట్. ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికలకు 5 రోజులే ప్రచార సమయం ఇచ్చారు.
అదే విధంగా సర్పంచ్ ప్రచారానికి ఏడు రోజులు సమాచారం ఇచ్చారు. మార్చ్ 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయన సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ తో భేటి కానున్నారు. విభజన హామీలు సహా మండలి రద్దు సహా అనేక విషయాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.