స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరానికి చెందిన 57 ఏండ్ల జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి ఒక విచిత్ర సమస్యతో విలవిల్లాడున్నాడు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాడు. కనీసం ఇంట్లో కూడా కుటుంబసభ్యుల ముందు తిరగలేకపోతున్నాడు. కేవలం ఒకటే గదికి పరిమితమై తన ఇంట్లో తాను ఖైదీలా బతుకుతున్నాడు.
ఇంతకు జేమ్స్ స్కాట్ సమస్య ఏంటంటే నిర్విరామ అంగస్తంభన. ఈ సమస్యవల్ల ఆయన కనీసం దుస్తులు కూడా ధరించలేకపోతున్నాడట. పురుషాంగానికి దుస్తులు తగిలితే విపరీతమైన నొప్పి కలుగుతుందట. మరోవైపు విరామం లేని అంగస్తంభన కారణంగా తాను ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని జేమ్స్ స్కాట్ ఆవేదన చెందుతున్నాడు.
అసలు జేమ్స్ స్కాట్‌కు ఈ సమస్య ఎలా వచ్చిందంటే.. జేమ్స్ స్కాట్ గతంలో కిటికీలకు, డోర్లకు అద్దాలు బిగించే పనిచేసేవాడు. అయితే నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో అతనిపై 15,00 కిలోల బరువైన ఒక అద్దం పడింది. ఈ ప్రమాదంలో జేమ్స్ ఉదరభాగంలో, వెన్నెముకకు, తొడలకు, గజ్జల్లో తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేసి జేమ్స్‌ను బతికించారు. అయితే, మూత్రనాళం మూసుకుపోవడంతో మరో శస్త్రచికిత్సతో సరిచేశారు.
సర్జరీల తర్వా్త జేమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ, అప్పుడు అతనిలో మరో సమస్య బయటపడింది. అదేంటంటే.. అంగస్తంభన లోపం. ఈ సమస్య పరిష్కారం కోసం జేమ్స్ స్కాట్ ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, ఎనిమిది వారాల క్రితం అతను ఓ ఆస్పత్రిలో తన సమస్యకు పరిష్కారం ఉందని తెలిసి అడ్మిట్ అయ్యాడు. దీంతో వైద్యులు అతనికి పురుషాంగంలో మెటల్ రాడ్ వేసి సర్జరీ చేశారు. ఆ మెటల్ రాడ్ క్రమంగా కరిగిపోయి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
ఆస్పత్రి నుంచి సంతోషంగా ఇంటికి చేరిన జేమ్స్‌ను ఇప్పుడు మరో సమస్య వేధిస్తోంది. పురుషాంగం నిర్విరామంగా స్తంభించే ఉండటం అతడిని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నది. ‘ఎనిమిది వారాలపాటు నొప్పిగా ఉండి, ఆ తర్వాత తగ్గిపోతుందని వైద్యులు నాకు చెప్పారు. కానీ వాస్తవానికి అలాంటిదేం జరుగలేదు. నాకు నొప్పి తగ్గకపోగా.. పురుషాంగం ఎప్పుడూ స్తంభించే ఉంటుంది. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం బట్టలు వేసుకోలేకపోతున్నా, నా తొమ్మిదేండ్ల బిడ్డను ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నా. ఆస్పత్రి వాళ్లకు సమస్య చెబితే సంబంధిత డాక్టర్లు అందుబాటులో లేరంటున్నారు.’ అని జేమ్స్ స్కాట్ ఆవేదన వ్యక్తం చేశాడు.