శివరాత్రినాడు శివునికి ప్రీతికరమైన వంటలలో ఇది ప్రత్యేకం..!

-

ఒకరోజు వచ్చే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఆ రోజు ఎంతో దీక్షతో పూజ చేసి ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఉపవాస దీక్ష పూర్తవ్వగానే శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఆలులో ఉంటాయి. అంతేకాకుండా శివరాత్రినాడు శివునికి ప్రీతికరమైన వంటలలో ఆలు కూడా ఒకటి. దీంతో ఒక రకమైన రెసిపీనే కాకుండా కొన్ని రకాల ఆలురెసిపీలు తయారుచేసుకోవచ్చు. ఉపవాసం ఉన్నవారు దీక్ష తర్వాత, లేనివారు కూడా తినేలా ఈ శివరాత్రినాడు ఆలుతో వెరైటీ రెసిపీలు మీ కోసం.

Maha Shivaratri Special recipes
Maha Shivaratri Special recipes

 

చిట్టి దమ్‌ ఆలు

కావాల్సినవి :
ఆలూ : 10
జీడిపప్పు : 10
ఉల్లిగడ్డ : 2
టమాట : 1
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ : ఒక టేబుల్‌స్పూన్‌
పసుపు : అర టీస్పూన్‌
కారం : 2 టీస్పూన్స్‌
జీలకర్రపొడి : 1 టీస్పూన్‌
ధనియాలపొడి : ఒక టీస్పూన్‌
కరివేపాకు : 2 రెమ్మలు
ఆవాలు, జీలకర్ర : 1 టీస్పూన్‌
కొత్తిమీర : ఒక కట్ట
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత.


తయారీ :
ముందుగా ఆలుగడ్డలను ఉడికించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత తొక్కతీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు, జీడిపప్పుని విడివిడిగా వేయించుకోవాలి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన ఆలుగడ్డలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపిన తర్వాత ఉల్లిగుజ్జు వేయాలి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా కలిపి కొంచెం నీరు పోసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. దించేముందు కొత్తిమీర తరుము వేసుకోవాలి. ఇక అంతే దమ్‌ బేబి పొటాటో రెసిపి రెడీ!

ట్యాంగీ ఆలూ టమాటర్‌

కావాల్సినవి :
ఆలుగడ్డలు : 5
టమాట : 2
పచ్చిమిర్చి : 2
పసుపు : అర టీస్పూన్‌
కారం : ఒక టీస్పూన్‌
ధనియాలపొడి : ఒక టీస్పూన్‌
గరంమసాలా : అర టీస్పూన్‌
జీలకర్ర : అర టీస్పూన్‌
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత.


తయారీ :
ఆలుగడ్డలను కడిగి నాలుగు భాగాలుగా కట్‌ చేసుకోవాలి. కుకర్‌లో వేసి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి. ఉడికిన తర్వాత తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు కడాయిలో నూనె వేడిచేసి జీలకర్ర, ఎండుమిర్చి, టమాట ముక్కలు వేసి వేయించాలి. అందులోనే పసుపు, కొద్దిగ ఉప్పు వేసి మిక్స్‌ చేస్తూ వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా వేసి వేయించాలి. వేగిన తర్వాత తొక్కు తీసిన ఆలుగడ్డలను అందులో వేసి వేయించాలి. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం నీరు పోయాలి. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌవ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే ట్యాంగీ ఆలూ తయారైనట్లే! ఇది అన్నానికి, రోటీల కాంబినేషన్‌ను బాగుంటుంది.

బేబి పొటాటో మసాలా ఫ్రై

కావాల్సినవి :
బేబీ పొటాటో : 8
పచ్చిమిర్చి : 3
ఉల్లిగడ్డ : 2
టమాట : 1
పసుపు : 1 టీస్పూన్‌
కారం : 1 టీస్పూన్‌
ధనియాలపొడి : 1 టీస్పూన్‌
గరాంమసాలా : అర టీస్పూన్‌
జీలకర్ర : 1 టీస్పూన్‌
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత


తయారీ :
ముందుగా బేబీపొటాటోలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రైయింగ్‌పాన్‌లో నూనె వేడిచేసి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. గోల్డ్‌ కలర్‌లోకి వచ్చాక ప్లేట్‌లోకి సర్వ్‌ చేసుకోవాలి. అంతలోపు ఉల్లి, టమాటా పేస్ట్‌లు సిద్ధం చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం నూనె వేడిచేసి జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. దీంతోపాటు పసుపు, ఉప్పు కూడా వేయాలి. రెండునిమిషాల తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. అందులో టమాట పేస్ట్‌ కూడా జోడించాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపాలి. అందులోనే కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి మిక్స్‌
చేయాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోలు కూడా వేసి మిక్స్‌ చేస్తూ వేయించాలి. చివరగా ఫ్రైకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

కుస్‌ కుస్‌ ఆలు

కావాల్సినవి :
ఆలు : 6
పచ్చిమిర్చి : 3
ఎండుమిర్చి : 3
పసుపు : ఒక టీస్పూన్‌
కొత్తిమీర : చిన్నకట్ట
కుస్‌ కుస్‌ (గసగసాలు) : 2 టీస్పూన్స్‌
నిమ్మరసం : ఒక టీస్పూన్‌
నూనె : 3 టేబుల్‌స్పూన్స్‌
ఉప్పు : తగినంత.
తయారీ :
ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలకు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. తర్వాత పాన్‌లో కొంచెం నూనె వేడిచేసి గోల్డ్‌బ్రౌన్‌కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పసుపు వేసి వేయించి తర్వాత అందులో పేస్ట్‌ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న ఆలుముక్కలు కూడా వేసి వేయిస్తూ అందులో మసాలా బాగా పట్టే వరకూ వేయించుకోవాలి. దీన్ని పదినిమిషాలపాటు సన్నని మంటపై వేయించుకోవాలి. ఇక అంతే
ఎంతో రుచికరమైన కుస్‌ కుస్‌ ఆలుని సేవించవచ్చు!

Read more RELATED
Recommended to you

Latest news