ఉత్తరాంధ్ర ప్రజలు ముష్టి వేయడం వల్ల చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రి అవ్వడం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబునాయుడు గ్రాఫ్ ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు విభజన జరిగిన తర్వాత కూడా ఎక్కువగా ఆదరించింది కోస్తా మరియు ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలు అన్ని రాజకీయ నిపుణులు చెబుతారు.
ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఉత్తరాంధ్రలో 34 ఎమ్మెల్యే స్థానాలలో పాతిక టీడీపీకి కట్టడం జరిగింది. ఈ దెబ్బతో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. దానికి కారణం ఉత్తరాంధ్ర. ఈ నేపథ్యంలో చంద్రబాబు ని మరియు టిడిపి ని బాగా అక్కున చేర్చుకున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం పట్ల చంద్రబాబు నాయుడిని మేధావులు మరియు ప్రజా సంఘాలు నిలదీస్తున్నారు.
ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అవంతి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడిని ఎన్నోసార్లు ఆదుకున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. విశాఖ పట్టణంలో రాజధాని వస్తుంది అంటే చంద్రబాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగానే రాద్ధాంతం చేసుకుంటూ పోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారని అవంతి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.