ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజ్యసభ సందడి నెలకొంది. వచ్చే నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు కాళీ అవుతున్నాయి. ఆ నాలుగు స్థానాలు కూడా వైసీపీకే వస్తాయి. దీనితో రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ని ఎవరిని నిలబెట్టే అవకాశ౦ ఉంది అనే దానిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ రేసులో ఉన్నారు అంటూ… షర్మిల, చిరంజీవి, రామిరెడ్డి, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇలా కొందరి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి.
వీరికి జగన్ అవకాశం ఇస్తారు అనేది మీడియా మాట. మరి జగన్ ఎవరిని ఆ రేసులో నిలబెడతారు అనేది తెలియడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్నీ కూడా మీడియాలో కథనాల ఆధారంగా వచ్చినవే గాని… ఏ ఒక్క వార్తకు సరైన ఆధారం లేదు. అయితే ఈ విషయంలో జగన్ అంతా రహస్యంగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కనీసం తన సన్నిహితులతో కూడా ఆయన చర్చించడం లేదని అంటున్నారు.
పార్టీలో తనకు సన్నిహితంగా ఉండే ఒక మంత్రితో మాత్రమే ఆయన చర్చిస్తున్నారని అంటున్నారు. విజయసాయి రెడ్డికి కూడా ఈ విషయంలో సమాచారం లేదని తెలుస్తుంది. ఎన్డియే కి సీట్లు ఇస్తారా లేదా అనేది తెలియడం లేదు. దీనితోనే జగన్ ఈ విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇక తన సన్నిహితులతో కూడా జగన్ ఏమీ చర్చించడం లేదని అంటున్నారు. మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.