పేదోడి ఆకలి తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : మంత్రి పొంగులేటి

-

ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టేది, ప్రతి పేదవాడి కష్టాలు, కన్నీళ్లు తుడిచేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే తప్ప మరి ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెద్దోడితో పాటు పేదవాడిని కూడా సమానంగా చూడాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్యానించారు. శుక్రవారం పినపాక నియోజకవర్గంలోని భూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా భూర్గంపహాడ్ మండలంలోని సారపాక గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడిలో నిర్వహిస్తున్న ముత్యాలమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. అంతేగాక పేదలకు 500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తామని తెలిపారు. రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. అలాగే గృహ జ్యోతి పథకం కింద పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news