చేతినిండా సినిమాలు ఉన్నా కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశాపటానీ అందాలను మాత్రమే నమ్ముకుంటుంది. అందులో భాగంగా తీరైన శరీర సౌష్టవంతో ఉన్న తన పిక్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ కుర్రకారు మతులు పోగొడుతుంది. దిశా పటానీకి యూత్ లో క్రేజ్ కూడా ఎక్కువే. ఇక ఫిటినెస్ మంత్రను పాటించే వారి జాబితాలో టాప్‌లో ఉంటుంది ఈ బ్యూటి. ఇదిలా ఉంటే.. గాల్లోకి ఎగిరి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఫైటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ట్రైనర్ సాయంతో ఆమె చేసిన ఈ ఫీట్ మామూలుగా లేదు.
దిశా పటానీ ఫిటినెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సినిమా షూటింగులతో తీరిక లేకుండా ఉంటున్నప్పటికీ వ్యాయాయం చేయడం మాత్రం ఆపదు ఈ భామ. తాజాగా ఇలా ‘బ్యాక్ ఫ్లిప్ ఫీట్’ వేసి అదరగొట్టేసింది. ఆమె వీడియో చూస్తోన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. జాకీచాన్, బ్రూస్లీలా అమ్మాయిలు కూడా అదరగొట్టేయగలరని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిమ్‌లో ట్రైనర్ సాయంతో .రెండుసార్లు బ్యాక్ ఫ్లిప్ ఫీట్ వేయడం విశేషం.