తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ నేతగా కేసిఆర్ దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం జరిగింది. ఇదిలా ఉండగా ముందు నుండి కేసిఆర్ ని భయంకరమైన రాజకీయ విమర్శలు చేసే తెలంగాణ నాయకులలో ముందు వరుసలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు కేసిఆర్ మాత్రమే టార్గెట్ అన్నట్టుగా వ్యవహరించేవారు.
దీంతో ఇటువంటి సందర్భంలో బీజెపి కూడా కేసిఆర్‌ని టార్గెట్ చేయాలంటే రేవంత్ రెడ్డే కరెక్ట్ అన్న రీతిలో పార్టీలోకి రావాలని ఆఫర్లు కూడా పంపడం జరిగింది. కానీ రేవంత్ మాత్రం వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ కేసీఆర్‌ని తన విమర్శలతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. అయితే రాజకీయంగా తనని ఎప్పటినుండో చికాకు పెడుతున్న రేవంత్‌ను కరెక్ట్ గా దార్లో పెట్టేవాడిని కేసిఆర్ దించబోతున్నట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్. విషయంలోకి వెళితే ఇటీవల భూ దందా వ్యవహారంలో రేవంత్ రెడ్డి పేరు, సోదరుడి పేర్లు బయటకు రావడం జరిగింది. ఇదొక్కటే కాకుండా, గతంలో చాలా భూములను ఈ సోదరద్వయం కాజేసినట్లు ఆరోపణలున్నాయి.
ప్రస్తుత వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ కూడా ఉండటంతో ముఖ్యమంత్రి అతన్ని సస్పెండ్ చేసారు. ఇక ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో నార్త్ ఇండియాకు చెందిన ఓ ప్రత్యేక అధికారిని కేసీఆర్ రంగంలోకి దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ, వివిధ కారణాల రీత్యా రేవంత్ కూడా తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం కచ్చితంగా రేవంత్ రెడ్డిని జైలుకు పంపించి, రాజకీయంగా ఫినిష్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.