గూఢచారితో ఊహించని రేంజ్ లో విజయం అందుకున్న అడివి శేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత స్పై థ్రిల్లర్ లో సక్సెస్ అందుకున్న హీరోగా అడివి శేష్ కు అపారమైన క్రేజ్ వచ్చింది. గూఢచారి కథ, కథనం కూడా అందించడంతో అది మరింత పెరిగింది. క్షణం, గూఢచారి ఈ రెండు సినిమాలు అడివి శేష్ సత్తా ఏంటో తెలియచేస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్ జోష్ తో అడివి శేష్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది. క్షణం నిర్మించిన పివిపి బ్యానర్ లో అడివి శేష్ హీరోగా ఓ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చిందట. ఎవరు అన్న టైటిల్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా అడివి శేష్ మునుపటి సినిమాల్లానే అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.
ఇక ఇదే కాకుండా 2 స్టేట్స్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు అడివి శేష్. ఆ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా నటిస్తుంది. మరి అడివి శేష్ కూడా ఇప్పుడు యువ హీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో స్టార్ ఇమేజ్ సాధించే సత్తా ఉన్న హీరోగా కూడా అతను కనిపిస్తున్నాడు.