వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి పై టిటిడి పాలక మండలి చర్యలకు దిగింది. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమన కరుణాకర్ రెడ్డిపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు కు ఫిర్యాదు చేశారు టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి.

ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి పై ఐటి యాక్ట్ 74, బి.ఎన్.ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసుల ను లిఖిత పూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి. దింతో వైసిపి party నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.