టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజున ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మస్క్ తో కాసేపు ఆయన మాట్లాడారు. ఇరువురు వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది వాషింగ్టన్‌లో మస్క్‌తో చర్చించిన అంశాలు ప్రస్తావించినట్లు ఆయన ట్వీటులో పేర్కొన్నారు.
సాంకేతికత, ఆవిష్కరణల్లో సహకారంపై మస్క్‌తో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించినట్లు సమాచారం. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు, మస్క్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఈ ఇరువురు పలు కీలక విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే.