ఉస్మానియా వర్సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతూ 12 వర్సిటీల ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు మూడోరోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు.

అయితే, సమ్మెకు అనుమతి లేదంటూ వారిని అరెస్టు చేశారు. మొత్తం 1,270 మంది కాంట్రాక్టు అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని పోరాడుతున్నారు.