జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. తాజాగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా..? అని ప్రశ్నించారు. సంజయ్ కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా..? అని సీరియస్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ అరాచకాలపై పోరాడి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. సీఎం స్థాయి వ్యక్తితోనే నాకు పోటీ ఉంటుందని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
నాడు అభివృద్ధిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డామని జీవన్ రెడ్డి గుర్తు చేసారు. జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అధిష్టానం తక్షణమే స్పందించి సర్ది చెబితే సమస్య సద్దుమణిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అబిప్రాయపడుతున్నారు. మరోవైపు మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి కావాలనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. పార్టీలో జీవన్ రెడ్డి పై కుట్ర జరుగుతుందని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.