బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ దుర్బాషలాడుతున్నారని.. ఆయన లాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెచ్చుకున్న రెండేళ్లలోనే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సమర్థుడైన నాయకుడు అని కొనియాడారు.
నాంపల్లిలోని గాంధీ భవన్‌లో మీడియాతో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ‘కేటీఆర్ దమ్ముంటే అధ్యక్ష పదవి తెచ్చుకో..రెండు సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, నీ బావను మెప్పించో, మీ చెల్లిని బుజ్జగించో నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో.. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు’ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు.