మాచర్లలో వైసీపీ కి బిగ్ షాక్ తగిలింది. 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందారెడ్డి సమక్షంలో వారంతా పసుపు జెండా కప్పుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధిపత్యం కొనసాగించింది. అప్పట్లో మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. పిన్నెల్లి పై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి గెలవడంతోో పరిస్థితులు తారుమారయ్యాయి.
ఎన్నికల పోలింగ్ బూత్ లో దౌర్జన్యానికి పాల్పడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు. దీంతో మాచర్లలో వైసీపీ ని నడిపే నాయకుడు కరువు అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు, కౌన్సిలర్లు కూటమి వైపు చూస్తున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా.. తాజాగా 17 మది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ పై ఫోకస్ పెట్టారు. చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.