మొగోడని మొల్క చల్లెటందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెల్కల పడ్డట్టు కాంగ్రెస్ పరిస్థితి ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎల్కచర్లలో నిర్వహించిన రజతోత్సవ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆశపడి ప్రజలు మోసపోయారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీశారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని అమలు చేసింది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది అవన్నీ చేసిందా..? అని ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న దేవుళ్లందరిపైన ఒట్లు వేశారు. మమ్ముల్ని ఎవ్వరూ నమ్మడం లేదు.. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఒక్క ఏడాదిలో ఇంత మారిపోయిందా..? అని ప్రశ్నించారు. పవర్ కట్ లు, మోటార్లు కాలిపోతున్నాయి. గోల్ మాల్ చేయడంలో కాంగ్రెస్ ని మించిన వాళ్లు లేరు. మేము ఇంత సిపాయిలం.. అంత సిపాయిలం అని ఎగిరి ఎగిరి దుంకేటోళ్లు మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతుందన్నారు.