కేసీఆర్ సభకు జనం అసలు రాలేదు.. వీడియోలు ఎడిటింగ్ చేశారని చురకలు అంటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎడిటింగ్ చేసిన వీడియోలు రేపు మేము చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ను విలన్ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్ కు తెలుసు అన్నారు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం నెట్టడం సరైనది కాదని తెలిపారు. అగ్గిపెట్ట రాజకీయానికి బలైపోయిన ఉద్యమకారులకు కనీసం నివాళి అయినా అర్పించారా..? అని నిలదీశారు మంత్రి పొన్నం ప్రభాకర్.