ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరుగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో సానుకూలమైన మార్పునకు కులగణన.. చరిత్రాత్మకమైన కులగణన, చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నాటకాలకు తెరలేపుతున్నారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి , కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. అలాగే ముస్లింలను తీసుకెళ్లి బీసీల్లో చేర్చడం దారుణం అన్నారు. కాంగ్రెస్ అన్ని తప్పుడు నిర్ణయాలు చేసిందని.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్రపతుల అభ్యర్థిత్వాలను వ్యతిరేకించిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
మోడీ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల పెండింగ్ అంశం ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టులోతమ వైఖరినీ స్పష్టం చేశాక.. వర్గీకరణ అంశం పై కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మోడీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీసీల పట్ల మొసలి కన్నీరే కార్చిందని తెలిపారు.