మూడు ఫార్మాట్ల‌లో నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీళ్లే: కోహ్లీ

-

ఈ తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ, తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో గొప్ప ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను ఆకట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల పేర్లను వెల్లడించాడు. టీ20 ఫార్మాట్ గురించి మాట్లాడుతూ, కోహ్లీ వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరు ప్రస్తావించాడు. “నరైన్ బౌలింగ్‌ను ఎదుర్కొనడం ఎప్పటికీ సులభం కాదు. అతను సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు,” అని కోహ్లీ తెలిపాడు.

టెస్ట్ క్రికెట్లో అయితే ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ కఠినమైన ప్రత్యర్థిగా పేర్కొన్నాడు. “ఇంగ్లాండ్‌లోని పిచ్‌లపై రెడ్ బాల్‌తో అండర్సన్‌ను ఎదుర్కోవడం అత్యంత సవాలుతో కూడుకున్నది,” అని కోహ్లీ అన్నాడు. వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే, రెండు బౌలర్లను గుర్తు చేశాడు. శ్రీలంక స్పీడ్ స్టార్ లసిత్ మలింగ ను తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పేసర్‌గా పేర్కొన్నాడు. అదే సమయంలో, ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో తనకు చాలాకష్టమిచ్చిన స్పిన్నర్ అని తెలిపాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news