వడదెబ్బ నుండి కాపాడుకోవాలా? అయితే ఈ పానీయాలను కచ్చితంగా తీసుకోండి..!

-

వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఆరోగ్యం పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో బయటకు వెళ్లడం వలన వడదెబ్బ వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వేడి నుండి రక్షించుకోవాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. అలాంటి సమయంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వలన డిహైడ్రేషన్ కు గురవ్వకుండా ఉండవచ్చు మరియు మజ్జిగ తాగడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి మొదలైన సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వడదెబ్బ నుండి రక్షించుకోవడానికి ప్రతి రోజు మజ్జిగను తీసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.

అంతే కాకుండా, నిమ్మరసం ను కూడా వడదెబ్బను ఎదుర్కొన్నప్పుడు ఉపయోగించవచ్చు. అంతేకాక ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వలన హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. ముఖ్యంగా నిమ్మరసం అనేది ఎలక్ట్రోలైట్ల లోపాన్ని తగ్గిస్తుంది. దీంతో వడదెబ్బనుండి తప్పించుకోవచ్చు మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. వేసవి కాలంలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే పుదీనా నీరును కూడా తీసుకోవచ్చు. దీనిని తాగడం వలన వడదెబ్బ మరియు దానికి సంబంధించిన లక్షణాలను కూడా తగ్గించుకోవచ్చు.

తలనొప్పి, వికారం, మైకం వంటి మొదలైన లక్షణాలను వేసవికాలంలో ఎదుర్కొంటే పుదీనా నీరుతో తగ్గించుకొని ఎంతో హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. అంతేకాకుండా కొబ్బరి నీరు కూడా వేసవికాలంలో ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. దీనిలో పొటాషియం తో పాటు ఎన్నో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. వీటన్నిటితో పాటుగా రోజంతా తరచుగా మంచి నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన ఎండ తీవ్రత నుండి ఉపశమనాన్ని పొందవచ్చు మరియు ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news