మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు మానవత్వం చాటుకున్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలో లారీ, కారు ఢీ కొట్టుకున్నాయి. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో జహీరాబాద్ వైపు వెళ్తూ ప్రమాదాన్ని చూసి కారు ఆపారు హరీశ్ రావు.

Former Minister Harish Rao shows humanity

స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు హరీశ్ రావు. జహీరాబాద్ వైపు వెళ్తూ ప్రమాదాన్ని చూసి కారు ఆపిన హరీష్ రావు పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news