పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాలకుర్తి అభివృద్ధిని విస్మరించారని..నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో ఆమె విఫలం అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే, తొర్రూరు నుండి హైదరాబాద్‌కు సుఖమైన ప్రయాణం కోసం రాజధాని ఏసీ బస్సులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి హైదరాబాద్‌కు రాజధాని ఏసీ బస్సులను పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించగా.. నియోజకవర్గం నుంచి ఏసీ బస్సులో ప్రయాణం చేసే వారు ఎంతమంది ఉంటారని.. కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.ముందుగా రోడ్డు మార్గాలను సుగమం చేయాలని కోరుతున్నారు.