టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు మాజీ ఎంపీ…? ఫైనల్ చేసిన కెసిఆర్…!

-

తెలంగాణాలో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయంగా బలంగా ఉన్న తెరాస పార్టీ ఇప్పుడు రాజ్యసభకు ఎవరిని పంపాలి అనే దానిపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుంది. ఈ నెలలో రెండు స్థానాలు తెలంగాణాలో ఖాళీ కానున్నాయి. దీనితో రాజ్యసభకు ఎవరిని పంపాలి అనే దానిపై అధిష్టానం సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ నేపధ్యంలో కెసిఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఓడిపోయినా సరే ప్రజల్లో ఉండే నేతలను రాజ్యసభకు పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే ప్రధానంగా ఒకరి పేరు చర్చకు వస్తుంది. ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం పార్లమెంట్ కి ఎంపిక అయ్యారు. అప్పటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయంగా కూడా తన పట్టు పెంచుకోవడమే కాకుండా అన్ని పార్టీలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఇక ప్రజల్లో ఉండటం, గృహ ప్రవేశానికి, ఓణీల ఫంక్షన్ కి పిలిచినా సరే ఆయన వెళ్తూ ఉంటారు. ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. తెరాస కార్యకర్తలతో పాటుగా, టీడీపీ కార్యకర్తలను కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. దీనితో ఆయనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అని కెసిఆర్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కవిత పేరుని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే కే కేశవరావు ని కూడా మళ్ళీ రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు. ఆయన పదవి కాలం కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంచాలా రాజ్యసభకు పంపించాలా అనే దానిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు కెసిఆర్. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెరాస వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news