ద‌స‌రా ఉత్స‌వాల‌కు ఇంద్రకీలాద్రి రెడీ!

-

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఈ ఏడాది భవానీ సేవాదళ్ పేరుతో 500 మంది పోలీసులు…వృద్ధులు, వికలాంగులకు సేవలందించనున్నట్లు చెప్పారు. అన్ని క్యూలైన్లను ఏర్పాటు చేశామని, అమ్మవారి ప్రసాదాలు భక్తులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నామన్నారు.

గత ఏడాదిలాగే వీఐపీల కోసం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్దేశించిన సమయంలోనే వీఐపీలు అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా ఈవో విజ్ఞప్తి చేశారు. కొండపైకి వచ్చేందుకు బస్సులను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశిష్టమైన మూలానక్షత్రం రోజున తెల్లవారుజామునే కాకుండా ఏ సమయంలో వచ్చినా అమ్మవారి ఆశీస్సులు పొందుతారని భక్తులకు ఈవో కోటేశ్వరమ్మ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news