ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఖతర్ సంపూర్ణ సహకారం

-

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఖతార్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనపై భారత ప్రజలతో ఖతార్ తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. మంగళవారం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, ఈ విషాదకర ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంభాషణలో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన అంశంగా చర్చకు వచ్చింది. ఈ దాడిని ఖండించిన ఖతార్ అమీర్, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ దేశం పూర్తిగా తోడుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చట్టం ముందు తీసుకురావడంలో భారతదేశం చేస్తున్న కృషికి ఖతార్ అన్ని విధాలుగా మద్దతిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ చూపిన మానవీయతకు, సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలపరిచేందుకు ఇరువురు నేతలు సంకల్పం వ్యక్తం చేశారు. ఖతార్ అమీర్ ఈ ఏడాది ప్రారంభంలో చేసిన భారత్ పర్యటనలో తీసుకున్న నిర్ణయాల అమలుపై వారు సమీక్షించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news