వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి కూడా భయపడుతున్నారా ..?

-

ఖైదీ నంబర్ 150 సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రాజకీయాలు వదిలి మళ్లీ సినిమాలలోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఖైదీ నంబర్ 150.. సైరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు చిరంజీవి. ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరంజీవి తన 152వ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండు మూడు విషయాలు చిరంజీవి తో పాటు మెగా ఫ్యాన్స్ ని బాగా టెన్షన్ పెడుతున్నాయని తాజాగా ఫిల్మ్ నగర్ లో న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

 

వాస్తవంగా కొరటాల శివ తెరకెక్కించే సినిమాలు బాగా లేటవుతుంటాయని తెలిసిందే. పర్ఫెక్ట్ గా రావడానికి బెటర్ మెంట్ కోసం ఎక్కువ గా సమయం తీసుకుంటారు. ప్రభాస్ మిర్చి సినిమా నుండి మహేష్ బాబు తో తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమా వరకు ఆయన తీసిన సినిమా షూటింగ్స్ బాగా లేటుగా చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా చిరంజీవి తో తెరకెక్కిస్తున్న సినిమాని మాత్రం ఆరు నెలల్లో పూర్తి చేయాలని చిరంజీవి అందరిముందే కొరటాల శివ కి తెలిపారు. అయితే అలా చెప్పినా అనుకోని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఎప్పటిలాగే డిలేగానే సాగుతుందట. ఇదే ఒక సమస్య అయితే ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అక్రమాలపై పోరాటం చేసే పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. అయితే అసలు సమస్య ఇక్కడే ఉందని చిరంజీవి అభిప్రాయపడుతున్నారట.

సినిమా రిలిజయ్యాక మతపరమైన అంశాలు ఇబ్బంది పెడతాయని చిరంజీవితో పాటు మిగతా యూనిట్ సభ్యులు ఆలోచనలో పడ్డారట. హిందూ మతానికి జరుగుతున్న అన్యాయంపై కొన్ని సీన్లను హైలెట్ చేసి తెరకెక్కించనున్న నేపథ్యంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్లు ఉంటుందని.. రేపు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని భావించి కచ్చితంగా మార్చాల్సిందే అని చిరంజీవి కొరటాల కి సూచించారట. దాంతో మళ్ళీ కొన్ని మార్పులు జరుగుతుండటంతో మెగా అభిమానులతో పాటు చిరంజీవి కొంత టెన్షన్ లో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news