ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారు అయిన నేపధ్యంలో మరో చర్చ మొదలయింది. రాజ్యసభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ ని పంపనున్నారు. వీళ్ళు ఇద్దరూ రాజ్యసభకు వెళ్తున్న నేపధ్యంలో తమ మంత్రి పదవులను కోల్పోనున్నారు. వారి స్థానంలో ఇప్పుడు మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకుంటారు అనేది స్పష్టత రావడం లేదు.
శాసన మండలి రద్దు అయిన నేపధ్యంలో వాళ్ళు ఇద్దరూ కూడా ఎమ్మెల్సీలు గా పదవులు కూడా కోల్పోతారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మంత్రి వర్గంలోకి ఆర్కే రోజా చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఆమెతో పాటుగా మరో ఎమ్మెల్యేని కూడా కేబినేట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేని మంత్రి వర్గంలోకి తీసుకునే సూచనలు కనపడుతున్నాయి.
దీని మీద ఇంకా స్పష్టత రాకపోయినా కచ్చితంగా జగన్… రోజాను తీసుకోవడం ఖాయమని అంటున్నారు. అప్పుడు ఆమెకు ఉన్న పదవిని ఎవరికి ఇస్తారో చూడాలి. రాజకీయంగా ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలు కొందరు ఇప్పుడు మంత్రి పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ధికంగా పార్టీకి అండగా నిలబడిన వారు ఎందరో ఉన్నారు. వారిలో మరి ఆ రెండు పదవులు ఎవరికి ఇస్తారో చూడాలి.