జవాన్ మురళినాయక్ వీరమరణం.. కొన్ని గంటల ముందే ఫ్యామిలీతో వీడియో కాల్!

-

జమ్ముకాశ్మీర్ సరిహద్దుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ యుద్దంలో పోరాడుతూ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.అయితే, మురళినాయక్ కుటుంబ సభ్యులు తన కొడుకు మరణవార్త తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చనిపోవడానికి కొన్ని గంటల ముందే కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

యుద్ధం లేకపోతే వచ్చే వారంలో సెలవులపై ఇంటికి రావాల్సి ఉందని వివరించారు. తీరా తన కొడుకు ఇకలేడని తెలుసుకుని వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జవాన్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, గ్రామస్తులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.అయితే, మురళి దేశం కోసం ప్రాణాలు అర్పించడం తమకెంతో గర్వకారణం అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, నేడు మురళి పార్థివ దేహం తన స్వగ్రామానికి చేరుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news