ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్దం నెలకొనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో గతంలో పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ గగనలతలం వైపు తమ విమాన రాకపోకలను నిలిపివేసింది. తమ విమానాలను టొరంటో, లండన్, రోమ్‌లకు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు మే 31వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. పాకిస్తాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు బంగ్లాదేశ్ తెలిపింది.
ఇదిలాఉండగా భారత్, పాకిస్థాన్ సైన్యం చర్యలు తీవ్రతరం అయ్యాయి. పాక్ పదేపదే సరిహద్దుల్లో భారత్ ను కవ్విస్తోంది. నిన్న సీజ్ ఫైర్ ఒప్పందానికి ముందు ఒకే చెప్పి.. సాయంత్రానికి మరల ఉల్లంఘనకు పాల్పడింది.సరిహద్దుల గుండా వస్తున్న డ్రోన్లను భారత డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. ఇదిలాఉండగా రేపు ఇరుదేశాల ఆర్మీజనరల్స్ మధ్య శాంతి చర్చలు, కాల్పులవిరమణపై కీలక భేటీ ఉంది