తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటు చేయనుంది. లక్డీకపూల్లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం పెట్టనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ.

తెలంగాణ రాష్ట్ర సర్కార్ సూచన మేరకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయమ తీసుకున్నట్లు సమాచారం. లక్డీకపూల్లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన చేసారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తునారు జీహెచ్ఎంసీ అధికారులు.