హోమ్ లీ ఫుడ్ అంటే తెలుసా మీకు.. ఇంట్లో వండుకునే ఆహారం. కానీ.. మనకు ఇంట్లో ఆహారం అనే వాక్.. అంటాం. అదే ఔట్ సైడ్ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ తింటాం. వారానికి మూడునాలుగు రోజులు బయట తినాల్సిందే. తినకపోతే అస్సలు కుదరదు. కానీ.. బయట ఆహారం తినే సమయంలో ఏనాడైనా ఆ ఆహారంలో వాడే నూనే ఏంటా అని ఆలోచించారా? ఏం నూనే వాడుతారో మీకు తెలుసా? వాళ్లు ఏ నూనె వాడుతారో తెలియకుండానే మీరు కుంబాలకు కుంబాలు లాగించేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి.. బయట ఫుడ్ ఎంత డేంజరో. ఈ కథనం చదివాక.. నెల రోజుల ముందు మీరు తిన్న బయటి ఆహారాన్ని కూడా కక్కేస్తారు.
చనిపోయిన ఎద్దులు, బర్రెలు, ఆవుల నుంచి కొవ్వు, ఎముకలను సేకరిస్తారు. ఒక్క నిమిషం ఆగండి.. అసలు మీరు చెప్పే స్టోరీకి… ఈ జంతువుల కళేబరాలకు ఏంది సంబంధం అంటారా? అందుకే.. ముందు పూర్తిగా కథనాన్ని చదవమనేది. ముందు డిస్టర్బ్ చేయకుండా కథనం మొత్తం చదవండి..
ఆ కొవ్వు ను పేద్ద మూకుడులో వేసి బాగా వేడి చేస్తారు. ఎముకలను రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తారు. తర్వాత ఆ కొవ్వు, ఎముకలను ప్రాసెస్ చేసి నూనె తయారు చేస్తారు. ఆ నూనెనే మీరు బయట తినే హోటళ్లలో వాడేది. ఇప్పుడర్థమయిందా.. మీరు బయట తినే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఇతర వంటకాలు ఎందుకు అంత టేస్ట్ ఉంటున్నాయో. జంతు కళేబరాలతో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయట. అవి డ్రగ్ టైప్. అందుకే ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తిన్నదంతా కక్కాలనిపిస్తున్నదా? ఆ నూనెలతో చేసిన వంటకాలు తింటే మీ శరీరం కూడా కళేబరంలాగానే మారుతుంది. లేనిపోని రోగాలన్నింటినీ మీరు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే.. బయట ఆహారం తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి. లేదు.. బయటి ఫుడ్డే మాకు రుచిగా ఉంటుంది.. అదే తింటాం అంటే ఇక.. మీ ఇష్టం. అన్ని హోటళ్లలో ఈ కల్తీ నూనె వాడుతారని చెప్పలేం. కానీ.. దాదాపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చాట్ బండార్స్, కర్రీ పాయింట్స్, చిన్న చిన్న హోటళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ కల్తీ నూనెనే వాడుతున్నారట. ఎందుకంటే ఇది కేవలం 20 నుంచి 30 రూపాయలకే లీటర్ లభిస్తుంది కాబట్టి. డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల జీవితాలతో వాళ్లు చెలగాటమాడుతున్నారు. అందుకే… బయటి ఫుడ్డుపై జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే తొందరలోనే టపా కట్టేస్తారు.. ఇక మీఇష్టం.