ఇరాన్ మంత్రికి సోకిన కోవిడ్-19,గల్ఫ్ దేశాల అప్రమత్తం

-

చైనా తో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ప్రబలుతోంది. తాజాగా ఈ కరోనా వైరస్ ఇరాన్ డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్ హార్చిరి కి సోకినట్లు అధికారులు తెలిపారు. దీనితో ఆయన స్వయంగా తనంతట తానే మంత్రిగారు నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన తనకు కరోనా సోకింది అని అందుకే ప్రస్తుతం వైద్య సహాయం తీసుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా ఇది సోకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరించారు కూడా. సోమవారం కొంచం జ్వరం తో బాధపడుతున్న ఆయనకు కోవిడ్-19 పరీక్షలు జరపడం తో పాజిటివ్ అని తేలింది అని అధికారులు వెల్లడించారు. మరోపక్క ఇరాన్ కు వెళ్లి వచ్చిన అనేక మంది గల్ఫ్ పౌరులకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీనితో ఇరాన్ నుంచి రాకపోకలను తాజాగా గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిషేధించినట్లు తెలుస్తుంది. తమ దేశంలో రోగం ముదరలేదని ఘంటా పథంగా చెప్పిన మరుసటి రోజే ఇరాన్ ఉప ఆరోగ్య మంత్రి తాను కరోనాతో బాధపడుతున్నట్లుగా వెల్లడించడం గమనార్హం.

ఈ మహమ్మారి ప్రభావంతో చమురు ధర పతనమై బుధవారానికి పీపాకు 50 డాలర్లకు చేరుకుంది. చైనా తర్వాత పెద్ద సంఖ్యలో దాని బాధితులు ఇరాన్‌లో ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో ఇరాన్‌కు వెళ్ళి వచ్చిన అనేక మంది గల్ఫ్ పౌరులకు కూడ ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ప్రతి ఏడాది విమోచన(ఇరాక్ సద్దాం హుస్సేన్ దురాక్రమణ నుండి) దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకునే కువైత్ కొవిడ్ కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈసారి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏ రకమైనా సామూహిక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రెండు వారాల వరకు నిర్వహించకూడదని కువైత్ ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటివరకు దేశంలో 25 మందికి కరోనా సోకినట్లు స్పష్టం చేసిన ప్రభుత్వం మరోపక్క ఇరాన్ కు వెళ్లిన తమ పౌరులను కూడా వెనక్కి రప్పించడానికి ప్రత్యేక విమానాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి కోవిడ్-19 తో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఈ కోవిడ్-19 బారిన పడి చైనా లో 2 వేల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్ లో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉండడం తో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news