ఇంటి నుండే రుణాన్ని పొందాలా? అయితే ఈ ఆన్లైన్ ప్రక్రియ ను తెలుసుకోవాల్సిందే..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అన్ని పనులు సులభం అయిపోయాయి అనే చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాంకు కు సంబందించిన పనులు కూడా ఇంట్లో నుండి పూర్తి చేసుకోవచ్చు. అదే విధంగా రుణాన్ని తీసుకోవడం కూడా ఎంతో సులభం అయింది. అకౌంట్ ఓపెన్ చేయడం నుండి రుణాన్ని తీసుకోవడం వరకు ఎన్నో పనులు ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని వ్యక్తిగత రుణాన్ని ఎంతో సులభంగా పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు.

ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణాలను ఎంతో సులభంగా అందిస్తోంది మరియు దీని ప్రక్రియ కూడా చాలా తేలికగా ఉంటుంది. తక్కువ మొత్తంలో రుణాన్ని పొందాలనుకున్న వారికి, ఎస్బిఐ 2.5 లక్షల వరకు రుణాన్ని అందుబాటులో ఉంచింది. అయితే దీనిని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి, యోనో ఎస్బీఐ యాప్ ద్వారా ఆన్లైన్ లో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు వెళ్లి ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే, ముందుగా యోనో ఎస్బీఐ యాప్ లో లాగిన్ అయ్యి, రుణాల భాగానికి వెళ్ళాలి.

దానిలో పర్సనల్ లోన్ ను ఎంపిక చేసుకుని అర్హతను చెక్ చేసుకోవాలి. తర్వాత రుణం మొత్తం మరియు తిరిగి చెల్లించే విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసిన తర్వాత, ఓటిపి ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వెంటనే జమ అవుతాయి. అయితే ఈ రుణానికి సంబంధించిన వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.30% నుండి 15.30% వరకు ఉంటాయి. దీనికి సంబంధించిన వ్యవధి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, రుణానికి సంబంధించిన వడ్డీ రేట్లు, క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం మరియు లోన్ రకం పై ఆధారపడి ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news